KCR : జస్టిస్ పీసీఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలు నిలిపివేయండి
విడివిడిగా హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీయం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు;
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నియజమించిన జస్టిస్ పిసీఘోష్ కమిషన్ నివేదికను నిలివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీఘోష్ నివేదికను అనుసరించి ప్రభుత్వం తదుపరి చర్యలు ఏవీ తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు విడివిడిగా హైకోర్టులో పిటీషన్లు ధాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం1952 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తమకు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హారీష్ రావులు ఇరువురు వేరు వేరు పిటీషన్లతో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ పిసీఘోష్ కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని పిటీషన్లలో కోరారు. జస్టిస్‌పీసీఘోష్‌తో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులుగా తమ పిటీషన్లలో పేర్కొన్నారు. జస్టిస్ పీసీఘోష్ కమిషన్ నివేదికను తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేసినా కాపీని మాకు ఇవ్వకుండా మా ప్రతిష్టను దిగజార్చేలా పదే పదే మీడియా ముందు మంత్రులు మాపై ఆరోపణలు చేస్తున్నారని, పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాపై ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ అప్రదిష్టపాలు చేస్తున్నారని కేసీఆర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ కమిషన్ వేశారని కేసీఆర్, హారీష్ రావులు తమ పిటీషన్లలో ఆరోపించారు.