Defection of MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
శాసనసభ్యుల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు;
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను ఏళ్ళ తరబడి తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడం సరికాదని చీఫ్ జస్టిస్ బీఆర్‌గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం హితవు పలికింది. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు వేసిన తరువాతే స్పీకర్ ఫిరాయింపు శాసనసభ్యులకు నోటీసులు ఇచ్చారని సీజే ధర్మాసనం గుర్తు చేసింది. ఫిరాయింపు చట్టంపై అంతిమంగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ బీఆర్‌గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రానికి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలుపొందిన దాదాపు పది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యులుగా చేరిపోయారు. ఈ ఫిరాయింపుల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు శాసనసభ్యులు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి సుప్రీం ధర్మాసంన గురువారం జూలై 31వ తేదీన తన తుది తీర్పును వెలువరించింది.