Telangana Congress : జంతర్‌మంతర్ వద్ద నేడు తెలంగాణ కాంగ్రెస్ ధర్నా
హాజరుకానున్న రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గేలు;
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశంతో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లుపై కేంద్రం ఆమోద ముద్ర వేసేలా ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, గెడ్డం వివేక్, కొండాసురేఖ్, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, సీతక్క జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొనన్నారు. వీరందరికీ సంఘీభావం తెలపడానికి నిన్ననే దాదాపు వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే మొదటి నుంచి కుల గణన, బీసీ రిజర్వేషన్లపై సానుకూలంగా ఉన్న ఏఐసీసీ కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీలతో పాటు ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ధర్నా కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది.