Telangana Government : ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

బనకచర్లపై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ;

Update: 2025-07-15 05:23 GMT

ఆంద్రప్రదేశ్‌ తలపెట్టిన గోదావరి బనచర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రేపు 16వ తేదీన బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్ని జల వివాదాలపై చర్చించడానికి కేంద్ర జలశక్తి శాఖ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వచ్చే ముందు ఏఏ అంశాలపై చర్చించనున్నారో ఒక ఎజెండా కాపీని పంపాలను కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌ కుమార్ ఆగర్వాల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఈ లేఖకు జవాబుగా తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై తమ వైఖరిని స్పష్టం చేస్తే కేంద్ర జలశక్తి శఖకు రిప్లై ఇచ్చింది. తాము బనకచర్లపై ఎటువంటి చర్చలకు సిద్దంగా లేమని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించడానికి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం మాత్రమే సింగిల్‌ ఎజెండాగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంలో చర్చ అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం నిర్ధ్వందంగా తిరస్కరించింది. ఓ పక్క తెలంగాణలో ప్రతిపక్షాలు బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రియార్టీగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ముందు ఇదొక్కటే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ తో కలసి చర్చలో పాల్గొనడం వల్ల అనవసరమైన అనుమానాలకు తావిస్తుందని భావించి ఈ అంశంపై చర్చకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News