Telangana Government: తెలంగాణ ఆర్థికాభివృద్ధి: ఆదాయం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు

తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు

Update: 2025-09-15 04:43 GMT

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు క్రియాశీలక చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కోసం ఆదాయ వనరులను పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఆదాయ లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.

సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్ని శాఖలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆదాయ పెంపుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లా నగరానికి సమీపంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతోంది. ప్రస్తుత ఆదాయాన్ని మరింత పెంచేందుకు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, టూరిజం ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటోంది.

ఆర్‌ఆర్‌ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) సమీపంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుపై ఆశలు పెట్టుకుంది. పరిశ్రమల విస్తరణకు అనువైన విధానాలు రూపొందిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఆలయ పరిసరాలను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెంపుల్ సిటీగా రూపొందించేందుకు జియోగ్రాఫికల్ ఏరియాను నిర్ణయిస్తున్నారు.

జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులపై దృష్టి పెట్టింది. భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వరదలతో ఇసుక మేటలు ఏర్పడుతుండగా, ఇసుక ద్వారా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.

Tags:    

Similar News