Panchayat Elections: తెలంగాణలో 3 దశల పంచాయతీ ఎన్నికలు

3 దశల పంచాయతీ ఎన్నికలు

Update: 2025-09-28 07:42 GMT

Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో, ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు, ఇందులో రూ.3.08 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. రాష్ట్రంలో 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఎన్నికల్లో భాగమవుతారు. ఈ సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ప్రధాన అంశాలు ఇలా...

రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ప్రత్యక్ష ఎన్నికలు, 565 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), 31 జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం పంచాయతీల్లో 100% ఎస్టీలు ఉన్న పంచాయతీలు 1,248, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 1,289, ఇతరుల్లో 10,223. రాష్ట్రంలో 11 గుర్తింపు పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలు లేకుండా జరుగుతాయి.

మహిళా ఓటర్లు ఎక్కువగా

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1,67,03,168 ఓటర్లలో 85,36,770 మహిళలు, 81,65,894 పురుషులు, 504 ఇతరులు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 31,377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో 8,123 సమస్యాత్మక, 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైనవి. 1,12,720 పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో 19,774 సమస్యాత్మక, 21,093 అతి సున్నిత, 2,324 అత్యంత సున్నితమైనవి.

బ్యాలెట్ బాక్స్‌లు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం, 1,18,547 సిద్ధం చేశారు.

ఎన్నికల సిబ్బంది

జడ్పీటీసీ ఎన్నికలకు 651 మంది, ఎంపీటీసీకి 2,337 మంది ఆర్వోలు, 2,340 ఏఆర్‌వోలు, 39,533 ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 ఇతర సిబ్బంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశకు 4,956 ఆర్వోలు, రెండో దశకు 14,407 ఆర్వోలు, 79,798 ప్రిసైడింగ్ అధికారులు, 1,03,318 ఇతర సిబ్బంది.

ఎన్నికల దశలు ఇలా...

పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో 41 మండలాల్లో 1,098 గ్రామాల్లో జరుగుతాయి, 9,324 వార్డులు. రెండో దశలో 272 మండలాల్లో 5,910 గ్రామాలు, 52,190 వార్డులు. మూడో దశలో 252 మండలాల్లో 5,752 గ్రామాలు, 51,020 వార్డులు.

మొదటి దశలో 290 జడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీలు, రెండో దశలో 275 జడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీలు.

Tags:    

Similar News