AICC CHIEF : తెలంగాణలో వచ్చినట్లే కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తాం..

కాంగ్రెస్‌ సామాజిక న్యాయభేరి సభలో ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే;

Update: 2025-07-05 04:48 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందో కేంద్రంలో సైతం అదేవిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరీ సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. పాకిస్తాన్‌ తో యుద్దం ప్రారంభించి మధ్యలోనే ఎందుకు ఆపేశారని ఖర్గే కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. పాకిస్తాన్‌ ని అది చేస్తా… ఇది చేస్తామని ప్రగాల్బాలు పలికి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ తో యుద్ద చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారన్నారు. మోడీలా ఇందిరాగాంధీ భయపడలేదని, ఎవరు అడ్డు వచ్చినా బంగ్లాదేశ్‌ కు స్వాతంత్రం కల్పిస్తామని ఇందికాగాంధీ తెగేసి చెప్పడమే కాకుండా చేసి చూపించిందని ఏఐసీసీ చీఫ్‌ చెప్పారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తీసేయాలని బీజేపీ చూస్తోందని, అసలు సెక్యులర్‌ అనే పదమే రాజ్యాంగంలో లేదని ఆపార్టీ చెపుతోందని మల్లికార్జునఖర్గే మండిపడ్డారు. రాజ్యంగం నుంచి సెక్యులర్‌ అనే పదాన్ని తీసేయాలని బీజేపీ తన ప్రణాళికలో రాసుకుందని, దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ పదాన్ని తీసేయాలని ఖర్గే ఛాలెంజ్‌ చేశారు.

Tags:    

Similar News