నైజీరియాలో కుండపోత వర్షాలు...111 మంది మృతి
A dam collapsed due to torrential rains in Nigeria
By : Politent News Web3
Update: 2025-05-31 07:03 GMT
నైజీరియాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా పడుతున్న వర్షాలకు ఓ డ్యామ్ కూలిపోయింది. డ్యామ్ నుంచి పోటెత్తిన వరదకు వందమందికి పైగా చనిపోయారు. సెంట్రల్ నైజీరియాలోని మోక్వా పట్టణానికి సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
మోక్వా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 111 మంది చనిపోగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారం యంత్రాంగం వెల్లడించింది. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండు రోజులుగా సెంట్రల్ నైజీరియాలో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టి ధాటికి ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి.