Nuclear Submarines : అణు జలాంతర్గాములను రంగంలోకి దింపిన అమెరికా

తమ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించడంపై తీవ్రంగా రియాక్ట్‌ అయిన రష్యా;

Update: 2025-08-02 06:52 GMT

రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రీ మెద్వెదెవ్‌ చేసిన డెడ్‌ హ్యాండ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా, రష్యా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులకు దారితీసాయి. మొద్వెదెవ్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు రష్యాపై మరింత కవ్వింపు చర్యలకు దిగారు. ఆయన ఆదేశాలతో అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది అమెరికన్‌ నేవీ. అయితే అమెరికా పాల్పడిన ఈ చర్యపై రష్యా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. అమెరికాను నిలువరించేందుకు మా వద్ద కూడా సరిపడ అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రష్యా సమీపంలోని సముద్ర జలాల్లో అమెరికన్‌ నేవీకి చెందిన రెండు అణు జలాంతర్గాములను మోహరించారు. అమెరికా ఈ చర్యపై రష్యన్‌ పార్లమెంట్‌ సభ్యుడు విక్టర్‌ ఓడోలాట్‌స్కీ స్పందించారు. మా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని, వాస్తవానికి అమెరికా దగ్గర ఉన్న అణు జలాంతర్గాముల కంటే రష్యా వద్దే అధికంగా ఉన్నాయని విక్టర్‌ వ్యాఖ్యానించారు. అమెరికా మోహరించిన అణు జలాంతర్గాములు కూడా రష్యా అణు జలాంతర్గాముల ఆధీనంలో ఉన్నాయన్న విషయాన్ని ఆదేశం గుర్తించాలన్నారు. డెడ్‌ హ్యాండ్‌ అనేది రష్యా సోవియట్‌ యూనియన్‌ గా ఉన్నప్పుడు జరిగిన ప్రచ్ఛన్న యుద్ద సమయంలో ఏర్పాటు చేసిన వ్యవస్త. రష్యాపై ఏ దేశమైన అణు దాడి చేస్తే ఆటోమేటిక్‌ గా ప్రతి అణుదాడులు జరుగే వ్యవస్ధ డెడ్‌ హ్యాండ్‌. ప్రత్యర్ధుల దాడుల వల్ల రష్యా నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకు పోయినా డెడ్‌ హ్యాండ్‌ వ్యవస్ధ ఆటోమేటిక్‌గా స్పందించి అణుదాడులు చేస్తుంది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ మెద్వెదెవ్‌ తాజాగా డెడ్‌ హ్యాండ్‌ ప్రస్తావన తేవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా రియాక్ట్‌ అయి యాక్షన్‌లోకి దిగిపోయారు. ఈ క్రమంలోనే రష్యా సమీపంలోని సముద్ర జాలల్లో రెండు అమెరికన్‌ అణు జలాంతర్గాములను మోహరించి ఉద్రికత్తలకు కారణమయ్యారు.

Tags:    

Similar News