యూఎస్ లో భారత విద్యార్ధికి అమానవీయ ట్రీట్ మెంట్!!
- చేతులకి సంకెళ్లేసి..బోర్లా పడుకోబెట్టి
- కుళ్ల బొడుస్తున్న అమెరికా పోలీసులు
- న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్టులో ఘటన
- ఈనెల 7న జరిగిట్లు వైరల్ వీడియో
- వీడియో పోస్ట్ చేసిన కునాల్ జైన్ అనే వ్యాపార వేత్త
- అక్రమ ఇమిగ్రెంట్ల డిపోర్టేషన్ టైమ్ లో ఘటన
- హర్యానా భాషలో అరుస్తున్న స్టూడెంట్
- విదేశాంగ మంత్రిజై శంకర్ కు ట్యాగ్ చేసిన జైన్
- వీడియో పై భారత్ లోనూ ఆగ్రహ జ్వాలలు
- స్పందించిన ఇండియన్ ఎంబసీ..
- బాధిత విద్యార్ధితో టచ్ లో ఉన్నామని భరోసా
- భారతీయులు భయపడొద్దంటూ అభయం
ఓ భారతీయ విద్యార్ధిని అమెరికా ఎంబసీ అధికారులు అమానవీయంగా ట్రీట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో అక్రమంగా అడుగు పెట్టిన ఆ విద్యార్ధిని స్వదేశానికి తిప్పి పంపే క్రమంలో అమెరికన్ ఎంబసీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ వీడియోని పోస్టు చేసిన ఓ వ్యాపారవేత్త కామెంట్ చేశారు.ఎంబసీ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో సెక్యూరిటీ ఆ విద్యార్ధిని తిప్పి పంపే విమానంలో పంపకుండా నేలపై బోర్లా పడుకోపెట్టి,పెడ రెక్కలు విరిచి సంకెళ్లు బిగించి ఆతనిపై ఇద్దరు పోలీసులు ఎక్కి కూర్చుని బెదిరిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియోని కునాల్ జైన్ అనే వ్యాపార వేత్త పోస్టు చేశారు.న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్టులో జూన్ 7వ తేదీన తానీ దృశ్యాన్ని చూసి రికార్డు చేసినట్లు కునాల్ ఎక్స్ లో పోస్టు చేశారు.భారత విద్యార్ధిని అత్యంత అమానవీయంగా,క్రూరంగా ట్రీట్ చేస్తున్నారని దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తక్షణం స్పందించాలని కోరుతూ ఆయనకు ట్యాగ్ చేశారు. అమెరికా ప్రభుత్వాన్ని నిలదీయాలని,అమెరికా కూడా దీనిపై దర్యాప్తు జరపాలని ఆ వ్యాపార వేత్త రాసుకొచ్చారు.
హాని తలపెట్టే ఉద్దేశం ఉండదు!!
భారత యువత ఎన్నో కలలతో అమెరికాకు వస్తుంటారని వారికి అమెరికాకు ద్రోహం చేయాలన్న ఉద్దేశం ఉండదని, ఇంత అమానవీయంగా ట్రీట్ చేయాల్సింది కాదని అన్నారు.సరైన పద్ధతిలో అడుగు పెట్టకుండా వచ్చే ఇలాంటి విద్యార్ధులకు కనీసం ఆంగ్ల పరిజ్ఞానం కూడా ఉండకపోవడం శోచనీయమని, బాధిత విద్యార్ధి కనీస ఆంగ్లం కూడా మాట్లాడలేక హర్యానా భాషలో మాట్లాడుతున్నాడని అన్నారు.అమెరికాకు వచ్చిన పర్పస్ చెప్పమంటే చెప్పలేక నోరెళ్ల బెట్టడంతో అధికారులు కుళ్లబొడుస్తున్నారని, ఇలాంటి స్టూడెంట్లలో చాలా మంది అడ్డదారుల్లో వీసా పొంది ఫ్లైట్లు ఎక్కేసి వచ్చేస్తుంటారని ఇలా అగచాట్లు పడుతుంటారని, స్వదేశంలో తల్లి దండ్రులకు ఈ కష్టాలు తెలియవని కునాల్ జైన్ అన్నారు. అయితే ఈ వీడియో నిజమైనదా కాదా అన్నది మాత్రం తెలియరాలేదు.
మిశ్రమ స్పందనలు..
ఈ వైరల్ వీడియోపై భారతలో ఆగ్రహ జ్వాలలు రేగాయి.భారత ప్రభుత్వం తక్షణం స్పందించాలని చాలా మంది అభిప్రాయపడగా,మరికొందరు నెటిజన్లు మాత్రం కనీసం ఇంగ్లీష్ రాకుండా అమెరికాకు వచ్చి ఏం వెలగబెడదామని.. తప్పు వారిదే. అలా ట్రీట్ చేయడంలో తప్పేం లేదని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి వ్యవహారాల్లో అక్కడున్న ఎన్నారైలు సైతం స్పందించి జాలి చూపరని కొందరు కామెంట్ చేస్తే.. ఏమీ రాని వాడు అక్కడ అడుగుపెట్టడమే తప్పంటూ మెజారిటీ అభిప్రాయపడ్డారు.
స్పందించిన భారత్..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతంపై న్యూయార్క్ లోని ఇండియన్ఎంబసీ స్పందించింది. ఇది తమదృష్టికి వచ్చిందని, ఆ భారతీయ విద్యార్ధి గురించి ఆరా తీస్తున్నామని, అక్కడి అధికారులతో మాట్లాడుతున్నామని వివరించింది. భారతీయులందరి భద్రత తమ బాధ్యత అని,ఎవరూ భయాందోళనలకు గురవ్వద్దని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.