తెలంగాణ స్పైసీ ఫుడ్ చాలా నచ్చింది – మిస్ డెన్మార్క్

Update: 2025-05-29 11:28 GMT

తెలంగాణ స్పైసీ ఫుడ్‌ చాలా నచ్చిందని మిస్‌ డెన్మార్ట్‌ ఎమ్మా హైస్ట్‌ చెప్పారు. భారతీయ వంటకాలు ఎంతో ఇష్టపడుతున్నాననన్నారు. ముఖ్యంగా గ్రీన్‌ కర్రీ, ఫిష్ కర్రీలు, వాటిలో స్పైసీ సాస్‌లు తనకు చాలా నచ్చాయని చెప్పారు. ఇక్కడి వంటకాల్లోని రంగులు, వాసనలు, మసాలాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.



హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న డెన్మార్క్ అందాలకన్య ఎమ్మా హైస్ పొలిటెంట్‌ మీడియాకు స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. హైదరాబాద్ తనకు రెండవ ఇల్లు లాంటిదని చెప్పారు. ఇక్కడి ప్రజలు చాలా ఆత్మీయంగా వ్యవహరిస్తున్నారని, అందుకే తనకు రెండో ఇల్లులా అనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌ సాంస్కృతిక వైవిధ్యం, ప్రాంతీయ జీవనశైలి అన్నీ ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తున్నాయన్నారు. అయితే, ఇంకా చూడాలని, ఇంకా తెలుసుకోవాలని ఉందన్నారు.



బాలీవుడ్ సినిమాలు ఇప్పటివరకు ఎక్కువగా చూడలేదని, అయితే, వాటి గురించి తెలుసుకోవాలని ఉందన్నారు.


Tags:    

Similar News