PM Modi argentina: అర్జెంటినా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ
బ్యూనోస్ ఏయిర్స్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది;
దక్షిణ అమెరికా ఖండంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు(శనివారం) అర్జెంటీనా చేరుకున్నారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అల్వియర్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. ‘మోదీ.. మోదీ..’, ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
57 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘అర్జెంటీనాతో సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్‌లో అడుగుపెట్టాను. అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి, విస్తృతంగా చర్చలు జరపడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ప్రధాని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు పంచుకున్నారు. రెండు రోజులపాటూ ప్రధాని అర్జెంటీలోనాలో పర్యటించనున్నారు.