PSLV F16 Nisar : నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16

ఇస్రో, నాసాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగం;

Update: 2025-07-30 04:44 GMT

ఇస్రో, నాసాల సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా రూపొందించిన నాసా-ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌(నిసార్‌) ఉపగ్రహాన్ని ఈరోజు బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. ఈఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఇస్రో చైర్మన్‌ కె.నారాయణన్‌ నిన్న మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. దాదాపు 2,392 కేజీల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16(జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌) రాకెట్‌ ద్వారా అంతరీక్షంలోకి పంపనున్నారు. భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో 98.40 డిగ్రీల వంపుతో నిసార్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భౌగోళిక పరిస్ధితులను పరిశోధించేందుకు ఉపయోగపడే ఈ ఉపగ్రమం పదేళ్ళపాటు కక్ష్యలో ఉండి సేవలు అందించనుంది. నిసార్‌ ప్రయోగంతో భాతర అంతరీక్ష పరిశోధన సంస్ధ, అమెరికా అంతరీక్ష పరిశోధనా సంస్ధల బంధం మరింత బలపడనుంది. ఈ ప్రయోగం అనంతరం భవిష్యత్తులో మరో మూడు అంతరీక్ష ప్రయోగాలు ఇస్రో, నాసాలు కలసి సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణన్‌ వెల్లడించారు. ఇదేసమయలో చంద్రయాన్‌-4 ప్రయోగ పనులకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ లో మరో నాలుగు ప్రయోగాలు నిర్వహించేందుకు లక్ష్యం పెట్టకున్నామని వీటితో పాటు గగన్‌యాన్‌ -1 పేరుతో మరో ప్రయోగం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ కె.నారాయణన్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News