పాకిస్థాన్ లో ఆత్మహుతి దాడి..13 మంది మృతి

Suicide attack in Pakistan.. 13 people killed

Update: 2025-06-28 10:02 GMT

పాకిస్థాన్‌ లో సైనిక కాన్వాయ్‌ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. దాడిలో 13 మంది సైనికులు మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. పేలుళ్లకు తామే బాధ్యులమని హఫీజ్ గుల్ బహదూర్ అనే సంస్థ ప్రకటించింది.  తేహరిక్ ఏ  తాలిబాన్(టిటిపి)కు ఈ సంస్థ అనుబంధంగా పనిచేస్తోంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలొచిస్తాన్  రాష్ట్రాల్లో సుమారు మూడు వందల మంది సైనికులు తిరుగుబాటుదారుల దాడుల్లో హతమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు అధికార పగ్గాలు చేపట్టాక పాకిస్థాన్ తో సరిహద్దు వివాదాలు పెరిగాయి. వజిరిస్థాన్ లోని జండోలా చెక్‌పోస్ట్ సమీపంలోని ఫ్రాంటియర్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి బాంబు పేలుడు ధాటికి రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. 

Tags:    

Similar News