మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు - భారత్‌లో 48 విమాన సర్వీసులు రద్దు

Tensions in the Middle East - 48 flights canceled in India

Update: 2025-06-24 09:07 GMT


ఇమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు - భారత్‌లో 48 విమాన సర్వీసులు రద్దు

రాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలోని కీలక గగనమార్గాలు తాత్కాలికంగా మూతపడటంతో, భారత్‌లోని విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. భారత్‌లో మొత్తం 48 విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేసినట్టు వెల్లడించింది. వాటిలో.. 28 విమానాలు వివిధ ప్రాంతాల నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోవాల్సినవి ఉండగా.. 20 విమానాలు న్యూఢిల్లీ నుంచి బయలుదేరాల్సినవి ఉన్నాయి. రద్దైన విమానాల్లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన 17 సర్వీసులు ఉండగా.. ఇండిగో సంస్థకు చెందిన 8 సర్వీసులు, ఇతర సంస్థలకు చెందిన 3 విమాన సర్వీసులు ఉన్నాయి.

మరోవైపు.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తాజాగా ఈ యుద్ధ వాతావరణం ముగిసిందని ప్రకటించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలోని విమానాశ్రయాలు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విమాన సర్వీసులను క్రమంగా పునఃప్రారంభిస్తామని ఇండిగో సంస్థ తెలిపింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించేవాళ్లు.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవాలి. అప్‌డేట్‌ ఇన్ఫర్మేషన్‌ కోసం ఎయిర్‌లైన్ అధికారిక ఛానళ్లను పరిశీలించాలి. రద్దైన లేదా ఆలస్యం అయిన సర్వీసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మధ్యప్రాచ్య గగన మార్గాల పునరుద్ధరణపై అప్డేట్స్ కోసం వార్తలను అనుసరించాలి. 

Tags:    

Similar News