US New Tariffs : పలు దేశాలపై కొత్త టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్
అత్యధికంగా సిరాయపై 41 శాతం అత్యల్పంగా బ్రెజిల్‌పై 10 శాతం టారిఫ్ విధింపు;
ఆగస్టు 1వ తేదీ వచ్చింది… అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించాడు. తాజాగా సుమారు 70 దేశాలపైన సుంకాలు విధిస్తూ నూతన ఎక్జిక్యూటీవ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అందరూ భావించినట్లుగానే తాజాగా విధించిన సుంకాల్లో అత్యధికంగా సిరియా దేశంపై 41 శాతం సుంకాన్ని విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ తరువాత మయాన్మార్‌పై 40 శాతం, స్విట్జర్లాండ్‌పై 39 శాతం, సెర్బియా, ఇరాక్‌లపై 35 శాతం, అల్గేరియా, బోస్నియా, కజకిస్తాన్, ట్యునేషియా, మొల్దోవా దేశాలపై 30 శాతం టారిఫ్‌లను ట్రంప్ కొత్తగా ప్రకటించారు. కెనడాపై ఇప్పటి వరకూ 25 శాతం ఉన్న టారిఫ్ ను 35 శాతానికి పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన దేశంపై కూడా 25 శాతం టారిఫ్ లను విధించారు. అదేవిధంగా బంగ్లాదేష్, శ్రీలంక, వియాత్నాం, తైవాన్ దేశాలపై 20 శాతం, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, పాకిస్తాన్, ఫిలిఫిన్స్ దేశాలపై 19 శాతం, నికరాగువాపై 18 శాతం, ఇస్రాయిల్, టర్కీ, నైజీరియా, జపాన్, ఘనాతో పాటు పలు దేశాలపై 15 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్, బ్రజిల్ వంటి దేశాలపై 10 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మేరకు ఆయన గురువారం ఎక్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే భారత్ పై విధించిన సుంకాల గురించి మాట్లాడుతూ 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. భారత్ మిత్ర దేశమే అయినప్పటికీ వారు మా మీద విధిస్తున్న సుంకాలు అధికంగా ఉన్నందున వారితో పరిమితంగానే వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దాశాల్లో భారతదేశం కూడా ఒకటన్నారు. భారత దేశం రష్యా నంచి భారీ స్ధాయిలో డిఫెన్స్ ఉత్తత్తులు, చమురు కొనుగోలు చేస్తుండటంతో ఆదేశంపై 25 శాతం సుకంతో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. సుంకాలు, పెనాల్టీలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. యూఎస్ విధించిన సుంకాల ప్రభావం ఏవిధంగా మనదేశంపై ఉండబోతుందన్న అంశాన్ని అధ్యయనం చేసతున్నట్లు భారత్ ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుక అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.