విమానం మెట్లెక్కుతూ తూలిపడ్డ ట్రంప్‌ - పాత జ్ఞాపకలు గుర్తు చేసిన నెటిజన్లు

Trump stumbles while climbing the steps of a plane - Netizens recall old memories

Update: 2025-06-09 10:50 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విమానం మెట్లు ఎక్కుతూ తూలి పడబోయారు. తన చేయితో బ్యాలన్స్‌ చేసుకొని తిరిగి ఏమీ ఎరగనట్లు మెట్లెక్కి విమానంలోకి వెళ్లిపోయారు. ఆదివారం న్యూజెర్సీలో జరిగిందీ సంఘటన. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌ మిన్‌స్టర్‌ నుంచి క్యాంప్‌ డేవిడ్‌కు బయలు దేరుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విమానం ఎక్కేందుకు మెట్ల మీదుగా వడివడిగా ఎక్కుతున్న ట్రంప్‌ మధ్యలో ఓ మెట్టు తప్పిపోవడంతో తూలి పడపోయారు. అయితే, తన చేత్తో బ్యాలన్స్‌ చేసుకొని తిరిగి మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.



గతంలో అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ కూడా ఇలాగే, విమానం ఎక్కుతూ పలుమార్లు తడబడ్డారు. ఆ సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జో బైడెన్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేశారు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే తరహాలో తూలి పడబోవడంతో సోషల్ మీడియా యూజర్లు పాత కామెంట్లను గుర్తు చేస్తున్నారు. అప్పుడు బైడెన్‌ను ట్రోల్‌ చేసిన విషయం గుర్తుందా? ట్రంప్‌... అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News