Amit Shah: అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అమిత్‌షా సూచన – తెదేపా ఎంపీలతో సమావేశం
తెదేపా ఎంపీలతో సమావేశం
Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో అన్నారు.
తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలోని ఎంపీలు సోమవారం పార్లమెంట్ భవనంలో అమిత్‌షాను కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను వివరించారు.
ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ నగరానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, చట్టపరమైన సహకారానికి ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభమైన అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని వివరించినప్పుడు అమిత్‌షా సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీలు చింతకాయల విజయ్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, సానా సతీష్, బీద మస్తాన్‌రావు, బీకే పార్థసారథి పాల్గొన్నారు.