Anantha Babu: కోర్టు బయటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

Update: 2026-04-24 11:56 GMT

Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

రాజమహేంద్రవరం కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణకు అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు బయటకు వచ్చిన వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేయడం వంటి ఆరోపణలపై ఇప్పటికే ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అరెస్ట్ అనంతరం అనంతబాబును కాకినాడకు తరలించి తదుపరి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News