AP Cabinet: ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 34 అజెండా అంశాలపై చర్చ జరిగింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ యాక్ట్‌-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దిశ బిల్లు-2019, ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు-2024లను ఉపసంహరించి మరింత పటిష్ఠమైన చట్టాల రూపకల్పనకు ఆమోదం తెలిపింది.

మున్సిపల్‌ భూముల లీజు గడువు పెంపునకు చట్ట సవరణలు, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పాదచారుల భద్రత పాలసీ-2026ను అమలు చేయాలని నిర్ణయించింది. రెండు కొత్త ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈవో పోస్టుల కేటాయింపుకు ఆమోదం లభించింది.

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి రూ.1002.49 కోట్లు కేటాయించారు. ట్విన్‌ టవర్స్‌ నిర్మాణ బాధ్యతలను ఎల్‌ అండ్‌ టీకి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీవోఎం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags: