AP High Court: ఇన్నర్ రింగ్ రోడ్డు వివాదంలో కీలక మలుపు – ఆళ్ల రామకృష్ణ రెడ్డికి నిరాశ

ఆళ్ల రామకృష్ణ రెడ్డికి నిరాశ

Update: 2026-03-30 10:48 GMT

AP High Court: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన మూడు కీలక పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

కేసును సీబీఐకి అప్పగించాలని, సీఎం చంద్రబాబు నాయుడుకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఏసీబీ కోర్టు విచారణను ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని ఖారీ చేసింది.

ఈ తీర్పుతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Tags:    

Similar News