Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై అక్రమ నిర్మాణాల విషయంలో కేసు నమోదు

అక్రమ నిర్మాణాల విషయంలో కేసు నమోదు

Update: 2026-04-03 11:02 GMT

Perni Nani: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)పై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేయడంతో, పేర్ని నాని తన అనుచరులతో కలిసి స్థలానికి చేరుకున్నారు.

అక్కడ అధికారులపై చిందులు తొక్కి, పోలీసులు సహా అధికారులను తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనపై పోలీసు అధికారుల సంఘం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో పేర్ని నాని అధికారుల విధులకు అంతరాయం కలిగించినట్లు, బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News