Minister Satya Kumar Yadav: పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత: ‘నేను అవకాశవాదిని కాదు.. బీజేపీ నా రక్తంలోనే ఉంది’-మంత్రి సత్యకుమార్ యాదవ్

మంత్రి సత్యకుమార్ యాదవ్

Update: 2026-07-06 13:48 GMT

Minister Satya Kumar Yadav: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, పేర్ని నానిని ‘చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు.

“నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు. నాని అవకాశం కోసం పార్టీలు మారుతారు. నా రక్తంలోనే కషాయం (బీజేపీ సిద్ధాంతాలు) ఉంది. ఒక మంత్రిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోను” అని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని, ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే తాను మాట్లాడుతానని తెలిపారు.

జగన్ ఒక నిలకడ లేని వ్యక్తి అని వ్యాఖ్యానించిన మంత్రి, అమరావతి త్వరలోనే పూర్తి అవుతుందని, రాజధాని అంశంపై జగన్ మాట్లాడటం అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరుస్తున్నామని, కొన్ని చోట్ల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News