Minister Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సన్నాహాలు చేసుకోండి.. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి: లోకేశ్
పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి: లోకేశ్
Minister Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులంతా పూర్తి సన్నద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ సహచర మంత్రులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, “ఎన్ని కార్యక్రమాలున్నా ఒక రోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి తీరాలి. షెడ్యూల్ ప్రకారం పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి” అని ఆదేశించారు.
పార్టీ ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని, విజ్ఞప్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని లోకేశ్ ఆదేశించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై వైకాపా చేస్తున్న విషప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలని చెప్పారు. “జాలర్ల ఉపాధి కల్పనకు వైకాపా అడ్డుతగులుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాలి” అని మంత్రులకు సూచించారు.
ప్రజల్లో చైతన్యం కల్పించేలా మంత్రులు చొరవ తీసుకోవాలని లోకేశ్ కోరారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.