Nimmala Rama Naidu: వైకాపా పాలన వల్లే రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం: మంత్రి నిమ్మల రామానాయుడు

మంత్రి నిమ్మల రామానాయుడు

Update: 2026-03-31 10:17 GMT

Nimmala Rama Naidu: రాష్ట్ర విభజన కంటే గత వైకాపా పాలన వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా అందిస్తోందని వివరించారు.

కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన బడ్జెట్ అవుట్‌ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొన్న నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “2024 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉంది. రాష్ట్ర విభజన కంటే వైకాపా దివాలా పాలనతోనే ఎక్కువ నష్టం జరిగింది” అని అన్నారు.

“అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోంది. ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు అందిస్తున్నాం. అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నాం. విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి, 2027 నాటికి పూర్తి చేసేలా పనులు వేగంగా చేపట్టాం. సంపద సృష్టిస్తూ ప్రజలకు సంపద పంచే దిశగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది” అని నిమ్మల రామానాయుడు వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు ఎలా మెరుగుపరుస్తున్నారో మంత్రి వివరించడంతో పాటు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ఆయన హైలైట్ చేశారు.

Tags:    

Similar News