Minister Anitha: అప్పలరాజును కలిసే ఆలోచనే లేదు.. మహిళా ఎస్సైపై దాడికి జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి అనిత
మంత్రి అనిత
Minister Anitha: శ్రీకాకుళంలో మహిళా ఎస్సైపై వైఎస్సార్‌సీపీ నేతల దాడిని మహిళా లోకం ఖండించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల గొడ్డలి పార్టీ నేతల తీరు మారాలని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు సమయానికి వెళ్లకుండా జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. “సీదిరి అప్పలరాజును కలవాలనుకుంటే ములాఖత్ సమయానికే జగన్ వెళ్లాలి. సమయానికి వెళ్లకుండా రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి అప్పలరాజును కలవాలన్న ఆలోచన జగన్‌కు లేదు. ములాఖత్‌కు మధ్యాహ్నం 2-3 గంటల మధ్య అధికారులు సమయం ఇచ్చారు. సాయంత్రం 5 తర్వాత జగన్ వెళ్తే అర్థమేంటి? కేవలం బలప్రదర్శన ఆలోచనే ఆయనకు ఉంది” అని మంత్రి అనిత అన్నారు.
మహిళా ఎస్సై పట్ల సొంత పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.