Pawan Kalyan: నారా లోకేశ్‌కు అభినందనలు: పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Update: 2026-04-16 11:44 GMT

Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేశ్ కొత్త బాధ్యతల్లో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షించారు.

అదేవిధంగా తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు కూడా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి

ఇటీవల గాయపడ్డ సినీ నటుడు వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ‘‘యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డాడని తెలిసింది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకుని, కెమెరా ముందుకు రావాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News