Pawan Kalyan: మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన పవన్ కల్యాణ్... జనసేన కట్టుబడి ఉంది! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జనసేన కట్టుబడి ఉంది! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Update: 2026-04-16 11:49 GMT

Pawan Kalyan: పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టసవరణ బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం తెలిపారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన పార్టీ పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలోనే మహిళా రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చామని గుర్తు చేశారు.

ఈ చట్టసవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించనుందన్నారు పవన్ కల్యాణ్. సమర్థులైన మహిళలు దృఢమైన కుటుంబాలను తయారు చేస్తారని, అలాంటి బలమైన కుటుంబాలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. మహిళల భాగస్వామ్యంతోనే దేశం సాధికారత దిశగా పయనించగలదని పేర్కొన్నారు.

ఈ శుభ సందర్భంలో మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారతీయురాలిగా ఆర్. వైశాలి చరిత్ర సృష్టించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఫిడే మహిళల టోర్నమెంట్‌లో విజేతగా నిలిచినందుకు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు.

Tags:    

Similar News