Satyakumar Yadav: తిరుమల మోడల్‌ను అనుసరించి ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

Update: 2026-03-21 11:35 GMT

పాలు, నెయ్యి, నూనె నాణ్యత పరీక్షలకు అత్యాధునిక పరిశోధనశాలలు

తిరుమల ల్యాబ్‌లో ఎన్‌ఏబీఎల్ అక్రెడిటేషన్ తర్వాత పూర్తిస్థాయి పనులు

Satyakumar Yadav: పాలు, నెయ్యి, నూనె, ముడిసరకుల నాణ్యత తెలుసుకోవడానికి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI)తో 2024లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వివరించారు.

‘‘కొద్ది కాలంలోనే తిరుమలలో పరిశోధనశాల ప్రారంభించాం. దీంతో ముడిసరకుల నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ల్యాబ్‌లో అత్యంత అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశాం. ఎన్‌ఏబీఎల్ (NABL) అక్రెడిటేషన్ వచ్చాక పూర్తిస్థాయిలో ల్యాబ్ పనిచేస్తుంది’’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

మూడు నెలల్లో గుంటూరు, విశాఖపట్నంలో ఇదే తరహాలో ల్యాబ్‌లు ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ల్యాబ్‌లను ఆధునికీకరిస్తామని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడబోమని స్పష్టం చేశారు.

ఈ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణకు మరింత బలం చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News