Telugu Desam Party Mahanadu 2026: టీడీపీ మహానాడు-2026: నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్వహణ.. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేశ్

సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేశ్

Update: 2026-05-07 15:24 GMT

Telugu Desam Party Mahanadu 2026: టీడీపీ మహానాడు-2026ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్ వేదికగా నిర్వహించనున్నారు. పార్టీ హైకమాండ్ ఈ మహానాడు నిర్వహణ కోసం 21 వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్‌ను నియమించింది.

మహానాడు మే 27న ప్రారంభమై 29వ తేదీన ముగియనుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన వివరాలను గురువారం పార్టీ తరఫున విడుదల చేశారు.

ఇంతకుముందు మే 6న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మహానాడు సందర్భంగా మొదటి రెండు రోజులు సుమారు 20 వేల మంది డెలిగేట్లు పాల్గొననున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించి ముగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఏడు లక్షలకు పైగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News