Mahindra : సఫారి, హెక్టర్లకు ఇక షాకే.. మహీంద్రా నుండి సరికొత్త 7-సీటర్ SUV
మహీంద్రా నుండి సరికొత్త 7-సీటర్ SUV;
Mahindra : భారత మార్కెట్‌లో మహీంద్రా కార్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా థార్, XUV, స్కార్పియో అంటే యువతలో ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మహీంద్రా తన సూపర్ హిట్ XUV700 ను కొత్తగా మార్చి తీసుకురాబోతోంది. ఈ కొత్త మోడల్ టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది. ఇది టాటా సఫారి, MG హెక్టర్ లాంటి 7-సీటర్ SUVలకు గట్టి పోటీ ఇవ్వడం పక్కా. 2021లో వచ్చిన XUV700 ఇప్పటికే చాలా పాపులర్. ఇప్పుడు దాని కొత్త వెర్షన్ వస్తోంది. బయటి లుక్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ముందు భాగంలో కొత్త హెడ్‌లైట్స్, అప్‌డేటెడ్ LED లైట్స్, కొత్త గ్రిల్, కొత్త బంపర్ వస్తాయి. పక్క భాగంలో పెద్దగా మార్పులు లేవు, కానీ కొత్త అల్లాయ్ వీల్స్ ఉండొచ్చు. వెనుక భాగంలో కొత్త బంపర్, SUV వెడల్పు అంతా ఉండే కొత్త LED లైట్‌బార్ వస్తాయని అంచనా. ఈ మార్పులతో XUV700 మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
XUV700 ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. కొత్త ఫీచర్లలో సెల్ఫ్-పార్కింగ్ ఫంక్షన్, డిజిటల్ బటన్లు, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో మంచి మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ వంటివి ఉంటాయి. ఇంటీరియర్‌లో XUV90 లాంటి కొత్త డ్యాష్‌బోర్డ్ కూడా ఉండొచ్చు. సేఫ్టీ విషయంలో మహీంద్రా ఎప్పుడూ ముందుంటుంది. ఈ కొత్త XUV700 ఫేస్‌లిఫ్ట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్ కూడా ఉంటాయి. ఇది ప్రయాణికులకు చాలా సురక్షితంగా ఉంటుంది. కొత్త XUV700 లో ఇంజిన్లు మారవు, పాతవే కొనసాగుతాయి. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 197 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 182 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. ఈ రెండింటికీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఈ అప్‌డేటెడ్ డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్లతో మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్, టాటా సఫారి, MG హెక్టర్ ప్లస్ లాంటి 7-సీటర్ SUVలకు గట్టి పోటీ ఇస్తుంది. ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే, టెక్నాలజీ, సేఫ్టీ అన్నీ ఉన్న కారు కావాలంటే, ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.