Bajaj Chetak : చేతక్ లవర్స్‎కు గుడ్ న్యూస్.. మళ్లీ ఉత్పత్త షురూ చేసిన బజాజ్

మళ్లీ ఉత్పత్త షురూ చేసిన బజాజ్;

Update: 2025-08-28 06:18 GMT

Bajaj Chetak : బజాజ్ ఆటో ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. చైనా నుండి దిగుమతి చేసుకునే రేర్ ఎర్త్ మాగ్నైట్స్ కొరత కారణంగా ఎదురైన సమస్యల తర్వాత, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌కు ముందు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కస్టమర్లకు స్కూటర్లు సమయానికి చేరవేయడమే కాకుండా డీలర్ల వద్ద కూడా తగినంత స్టాక్ లభిస్తుంది.

మ్యాగ్నెట్‌ల కొరత కారణంగా జూలై 2025లో బజాజ్ చేతక్ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే దాదాపు 47 శాతం తగ్గి 10,824 యూనిట్లుగా నమోదైంది. అప్పట్లో సరఫరా మెరుగుపడకపోతే ఆగస్టులో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవచ్చని బజాజ్ అధికారులు హెచ్చరించారు. అయితే, ఇప్పుడు సరఫరా మళ్లీ మొదలవ్వడంతో, డిమాండ్‌ను తీర్చడానికి తమ వద్ద తగినంత స్టాక్ ఉందని కంపెనీ తెలిపింది. డీలర్‌షిప్‌లకు స్కూటర్ల డిస్ట్రిబ్యూషన్ కూడా తిరిగి ప్రారంభమైంది. దీంతో బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా డెలివరీలు జరుగుతాయి.

డిజైన్, ఫీచర్లు

బజాజ్ చేతక్ ప్రీమియం, రెట్రో-బెస్డ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

మైలేజ, పర్ఫార్మెన్స్

ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచే చేతక్ సిటీ ప్రయాణాలకు చాలా బాగుంటుంది. ఇందులో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీ మంచి మైలేజీ ఇస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న రీజనరేటివ్ బ్రేకింగ్ మైలేజీని మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ స్కూటర్ అనేక ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది.

ధర

బజాజ్ చేతక్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఉత్పత్తి తిరిగి ప్రారంభం కావడంతో పండుగ సీజన్‌లో పెరిగే డిమాండ్‌ను తాము సులభంగా ఎదుర్కోగలమని బజాజ్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో (విడా) వంటి పోటీదారుల నుంచి పోటీని ఎదుర్కోవడానికి కూడా బజాజ్‌కు సాయపడుతుంది.

Tags:    

Similar News