Best Bikes : మైలేజీలో కింగ్స్..లుక్స్‌లో కిరాక్..రూ.లక్షలకు లభించే టాప్ 5 బైక్స్ ఇవే

రూ.లక్షలకు లభించే టాప్ 5 బైక్స్ ఇవే

Update: 2026-01-20 11:45 GMT

Best Bikes : మధ్యతరగతి కుటుంబాలకు బైక్ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది వారి రోజువారీ జీవితంలో ఒక భాగం. ఆఫీసుకి వెళ్లాలన్నా, డెలివరీ పనులకైనా తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజీ ఇచ్చే బైక్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, స్టైలిష్ లుక్స్, బెస్ట్ మైలేజీని అందించే బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.

1. టీవీఎస్ రైడర్ 125

ప్రస్తుత యువత మనసు దోచుకుంటున్న బైక్ ఏదైనా ఉందంటే అది టీవీఎస్ రైడర్ 125 మాత్రమే. 125సీసీ సెగ్మెంట్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80,500 నుంచి రూ.96,100 వరకు ఉంది. లీటరుకు సుమారు 56 నుంచి 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది (కొత్త iGO వేరియంట్ ఇంకా ఎక్కువ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది). ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, 99 కంటే ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. స్పోర్టీ లుక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

2. టీవీఎస్ స్పోర్ట్

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ ఒక వరప్రసాదం. ఇది బ్రాండ్ మోస్ట్ సేల్లింగ్ బైక్ లలో ఒకటి. దీని ధర చాలా తక్కువ.. సుమారు రూ.55,100 నుంచి రూ.57,100 మధ్య ఉంటుంది. ఈ బైక్ ఏకంగా 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 110సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ మెయింటెనెన్స్ చాలా తక్కువ. సామాన్యులకు ఇది పక్కా బడ్జెట్ బైక్.

3. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన ఈ కొత్త బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 125సీసీలోనే షార్ప్ లుక్స్‌తో ఇది ప్రీమియం బైక్‌లా కనిపిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.91,760. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. లీటరుకు సుమారు 66 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ లాంటి ఫీల్ రావాలి కానీ బడ్జెట్ లక్ష లోపు ఉండాలి అనుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

4. హీరో స్ప్లెండర్ ప్లస్

దశాబ్దాలుగా భారతీయుల నమ్మకానికి మారుపేరు స్ప్లెండర్. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ కూడా ఇదే. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.73,902 నుంచి రూ.77,000 మధ్యలో ఉంది. సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీని పక్కాగా ఇస్తుంది. దీని రీసేల్ వాల్యూ చాలా ఎక్కువ. విడిభాగాలు ఎక్కడైనా దొరుకుతాయి. కొత్త XTEC వెర్షన్‌లో డిజిటల్ మీటర్ వంటి ఫీచర్లు కూడా చేర్చారు.

5. బజాజ్ పల్సర్ 125

పల్సర్ అంటేనే ఒక బ్రాండ్. ఆఫీసుకి స్టైలిష్‌గా వెళ్లాలనుకునే వారికి పల్సర్ 125 ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర రూ.80,000 నుంచి రూ.88,000 మధ్యలో ఉంది. లీటరుకు సుమారు 55 నుంచి 66 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. పల్సర్ సిగ్నేచర్ లుక్, మంచి పవర్ కావాలనుకునే వారి కోసం ఈ బైక్ డిజైన్ చేయబడింది. సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Tags:    

Similar News