Best Bikes Under 1.5 Lakh : రూ.1.5 లక్షల లోపు బెస్ట్ బైక్స్ ఇవే.. కొత్త బైక్ కొనే వారికి అదిరిపోయే ఆప్షన్స్!
కొత్త బైక్ కొనే వారికి అదిరిపోయే ఆప్షన్స్!;
Best Bikes Under 1.5 Lakh : కొత్త బైక్ కొందామని ఆలోచిస్తున్నారా? మీ దగ్గర రూ.1.5 లక్షల వరకు బడ్జెట్ ఉందా? అయితే ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా రకాల బైక్‌లు ఉన్నాయి. స్టైల్, మంచి మైలేజ్, బోలెడు ఫీచర్లు, సరసమైన ధర ఇవన్నీ ఒకే బైక్‌లో దొరకడం కష్టమే. కానీ టెన్షన్ పడొద్దు.. హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి రూ.1.5 లక్షల లోపు దొరికే కొన్ని మంచి బైక్‌ల లిస్ట్ చూద్దాం.
ముందుగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ ఉంది. దీని ధర సుమారు రూ.1.40 లక్షలు. ఇది 160సీసీ బైక్‌లలో హీరోలో ఖరీదైనది అయినా, లుక్ అదిరిపోతుంది. ఇందులో డ్యూయల్-ఛానెల్ ఏబీఎస్, కొత్త ఎల్‌సీడీ డిస్‌ప్లే లాంటి అప్‌డేట్స్ కూడా వచ్చాయి. తర్వాత, టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 160 4వీ. దీని ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ఉంటుంది. ఇది టీవీఎస్‌లో చాలా పాపులర్ బైక్, రోజువారీ అవసరాలకు బాగా పనికొస్తుంది. దీనికి కూడా కొత్త యూఎస్‌డీ ఫోర్క్ అప్‌డేట్ ఇచ్చారు.
ఇక బజాజ్ పల్సర్ ఎన్160 గురించి చెప్పాలంటే, దీని ధర రూ.1.22 లక్షల నుంచి రూ.1.43 లక్షల మధ్య. ఇది పాత పల్సర్‌ల కంటే ఇంజిన్, పనితీరులో చాలా మెరుగ్గా ఉంటుంది. దీంట్లో కూడా యూఎస్‌డీ ఫోర్క్ అప్‌డేట్ ఉంది. టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 160 2వీ కూడా ఉంది, దీని ధర రూ.1.22 లక్షల నుంచి రూ.1.43 లక్షల మధ్య. దీని లుక్ స్పోర్టీగా ఉంటుంది. మార్కెట్‌లో మంచి పనితీరు కనబరుస్తోంది.
మీ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంటే, టీవీఎస్ రేడియాన్ మంచి ఆప్షన్. దీని ధర రూ.59,880 నుంచి రూ.83,984 వరకు మాత్రమే. దీన్ని తేలికగా హ్యాండిల్ చేయొచ్చు, ముందు డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. చివరిగా, కొంచెం ఎక్కువ థ్రిల్ కోరుకునే వాళ్లకు బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్200 ఉంది. దీని ధర రూ.1.52 లక్షలు. ఇది పదేళ్లయినా ఇంకా మార్కెట్‌లో ఉంది అంటే దీని స్పీడ్, ఇంజిన్ ఎంత బాగుంటాయో అర్థం చేసుకోవచ్చు. కేటీఎం నుంచి తీసుకున్న ఇంజిన్‌తో ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.