Royal Enfield: చరిత్ర తిరగరాసిన రాయల్ ఎన్‌ఫీల్డ్..గేమర్ల చేతుల్లోకి బుల్లెట్ 350, కాంటినెంటల్ GT 650
గేమర్ల చేతుల్లోకి బుల్లెట్ 350, కాంటినెంటల్ GT 650
Royal Enfield:మొబైల్ గేమింగ్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టించిన BGMI, భారతీయ బైక్ లవర్స్ కలల బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చేతులు కలిపాయి. క్రాఫ్టన్ ఇండియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో భాగంగా ఇకపై గేమర్స్ యుద్ధభూమిలో శత్రువులను వేటాడేందుకు బుల్లెట్ బైక్‌లను ఉపయోగించవచ్చు. ఈ భారీ కొలాబరేషన్ గేమింగ్, ఆటోమొబైల్ రంగాల మధ్య సరికొత్త అనుభూతిని అందించబోతోంది. BGMI 4.2 అప్‌డేట్ జనవరి 15, 2026 నుండే లైవ్ అవుతున్నప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను మాత్రం జనవరి 19 నుండి ఫిబ్రవరి 22, 2026 వరకు గేమ్‌లో రైడ్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ ద్వారా బుల్లెట్ 350, కాంటినెంటల్ GT 650 మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఈ భాగస్వామ్యం కేవలం బైక్ రైడింగ్‌తోనే ఆగిపోలేదు. గేమర్ల కోసం ప్రత్యేకమైన రివార్డులను కూడా ప్రకటించారు.
SPIN ఈవెంట్: స్పిన్ ఫార్మాట్ ద్వారా పర్మనెంట్ రివార్డులను గెలుచుకోవచ్చు.
లాయిల్టీ క్రేట్స్: రోజుకు కనీసం 60 నిమిషాల పాటు గేమ్ లాగిన్ అయి ఉంటే (ఆడకపోయినా పర్లేదు), రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవెంట్ క్రేట్స్ లభిస్తాయి.
స్పెషల్ ఐటమ్స్: రెవెల్ 01 సెట్ (Revel 01 Set), బుల్లెట్ లైన్ P90 స్కిన్, క్రాంక్ గార్డ్ హెల్మెట్, రోడ్ బోర్న్ రక్ సాక్ వంటి మిథిక్ రివార్డులను సొంతం చేసుకోవచ్చు.
ఈ కొలాబరేషన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక కస్టమ్ బిల్ట్ కాంటినెంటల్ GT 650ను తయారు చేసింది. ఢిల్లీకి చెందిన కస్టమ్ బిల్డర్ సహాయంతో రూపొందించిన ఈ బైక్‌కు మిలిటరీ స్టైల్ ఆర్మర్ ప్లేటింగ్, పారాచూట్ టై-డౌన్ పాయింట్స్, బెలూన్ టైర్లను అమర్చారు. ఇది చూడటానికి అచ్చం BGMI గేమ్‌లోని టాక్టికల్ వెహికల్‌లా కనిపిస్తుంది.