BSA Motorcycles : BSA బైక్స్ కొత్తగా వచ్చేశాయ్.. స్క్రాంబ్లర్ 650, బాంటమ్ 350 లాంచ్!
స్క్రాంబ్లర్ 650, బాంటమ్ 350 లాంచ్!;
BSA Motorcycles : బ్రిటన్ బ్రాండ్ BSA మోటార్‌సైకిల్స్ రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. BSA స్క్రాంబ్లర్ 650, BSA బాంటమ్ 350. చాలా కాలంగా BSA బైక్‌లు బ్రిటన్ ఇంజనీరింగ్, అద్భుతమైన పర్ఫామెన్స్ కు మారుపేరుగా నిలుస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో ఒరిజినల్ బాంటమ్ ఒకటి. ఇప్పుడు అదే స్ఫూర్తిని కొత్త బాంటమ్ 350లో కూడా చూడవచ్చు. స్క్రాంబ్లర్ 650 లాంచ్ BSAకి ఒక పెద్ద ముందడుగు. దీని డిజైన్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తుంది. అడ్వాన్సుడ్ ఇంజనీరింగ్తో ఈ బైక్‌ను తయారు చేశారు. కొత్త BSA స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ బ్రిటిష్ స్టైల్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది డ్యుయల్-పర్పస్ బైక్‌ల విభాగంలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది.
ఈ మోటార్‌సైకిల్ 652సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 6500rpm వద్ద 45PS పవర్, 4000rpm వద్ద 55Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్, అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 5-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ఇవి ఎలాంటి రోడ్లపై అయినా అద్భుతమైన బ్యాలెన్స్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. BSA స్క్రాంబ్లర్ 650 స్పీడు, కంట్రోల్, స్టైల్‌తో కూడిన సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. దీని రైడింగ్ పొజిషన్ చాలా బాగుంటుంది. విశాలమైన హ్యాండిల్‌బార్లు, స్ట్రాంగ్ లో-ఎండ్ టార్క్ తో, ఈ బైక్ సిటీ రోడ్ల నుండి కఠినమైన ఆఫ్-రోడ్ మార్గాల వరకు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని రగ్గడ్ అప్పీల్‌ను మరింత పెంచడానికి థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ ఎల్లో అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
స్క్రాంబ్లర్ 650లో బ్రెంబో బ్రేక్స్ తో పాటు డ్యుయల్-ఛానల్ ABS, వైర్-స్పోక్ అల్లాయ్ రిమ్స్ ఉన్నాయి. బైక్ 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 218 కిలోల బరువు దీన్ని లాంగ్ రైడ్‌లకు పర్ఫెక్ట్‌గా చేస్తాయి. అంతేకాకుండా, 820 మి.మీ. సీట్ ఎత్తు, 1463 మి.మీ. వీల్‌బేస్ రోడ్డుపై కాన్ఫిడెన్స్ తో రైడింగ్ అందిస్తుంది.