Hyundai : ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి.. రూ.6లక్షల కారుపై ఏకంగా రూ.70వేల తగ్గింపు
రూ.6లక్షల కారుపై ఏకంగా రూ.70వేల తగ్గింపు;
Hyundai : భారత మార్కెట్‌లో ఎన్నో వాహన తయారీ కంపెనీలు ఉన్నాయి. కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. వాహన తయారీ సంస్థ హుండాయ్ జూలై 2025 నెలలో తమ వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ కేవలం జూలై 2025 వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే రూ.70,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
డిస్కౌంట్ గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని డీలర్‌షిప్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిస్కౌంట్ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కారు కొనే ముందు ఒకసారి స్వయంగా వెళ్లి ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, యాంబియెంట్ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.98 లక్షలు, అయితే దీని టాప్ వేరియంట్ రూ.8.62 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది 83 bhp పవర్‌ను, 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు, కంపెనీ ఈ కారులో సీఎన్‌జీ వేరియంట్ ను కూడా వినియోగదారులకు అందిస్తుంది. ఇది మైలేజ్ పరంగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపికగా పరిగణించబడుతుంది.