Hero HF Deluxe : బైకర్లకు బంపర్ ఆఫర్! ఈ బైక్ ధర రూ.6 వేలు తగ్గింది.. కొత్త ధర ఎంతో తెలుసా?

కొత్త ధర ఎంతో తెలుసా?

Update: 2025-09-06 07:05 GMT

Hero HF Deluxe : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను సవరించింది. దీనితో ప్రజలకు దీపావళికి ముందు ఒక పెద్ద బహుమతి లభించింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత కార్లు , మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గుతున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడం ప్రజలకు కొంచెం సులభం కానుంది. త్వరలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఆ బైక్ ధర ఎంత తగ్గుతుందో తెలుసుకుందాం. కొత్త జీఎస్టీ సవరణల ప్రకారం.. 350సీసీ వరకు ఉన్న స్కూటర్లు, బైక్‌లు ఇప్పుడు చౌకగా లభిస్తాయి. అయితే, 350సీసీ కంటే ఎక్కువ ఉన్న బైక్‌లు మాత్రం ఖరీదైనవిగా మారుతాయి. చిన్న మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించబడుతుంది. ఈ జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో 97.2సీసీ ఇంజిన్ ఉంది, ఇది 350సీసీ కంటే చాలా తక్కువ. దీనితో ఈ బైక్ 10% జీఎస్టీ తగ్గింపు తర్వాత లభిస్తుంది. ప్రస్తుతం హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.65,808. ఈ ధరలో 10% తగ్గిస్తే, ఈ బైక్ ధర రూ.59,227 అవుతుంది. ఈ విధంగా ఈ బైక్‌పై ఏకంగా రూ.6,581 ఆదా చేయవచ్చు. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో 97.2సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, ఓహెచ్‌సీ టెక్నాలజీతో కూడిన ఇంజిన్ ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. ఇది చాలా అద్భుతమైన షిఫ్టింగ్ ఎక్సపీరియన్స్ అందిస్తుంది. హీరో ఈ డైలీ కమ్యూటర్ బైక్ 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చింది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ను ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనితో పాటు, ఇటీవల కంపెనీ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రోను అనేక అద్భుతమైన, కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీ ఇవ్వబడింది. ఇది ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News