Hero Splendor Plus : కేవలం రూ.9,000 కట్టండి..హీరో స్ప్లెండర్ ఇంటికి పట్టుకెళ్ళండి
హీరో స్ప్లెండర్ ఇంటికి పట్టుకెళ్ళండి
Hero Splendor Plus : భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు హీరో స్ప్లెండర్ కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అదొక నమ్మకం. దశాబ్దాలుగా మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న ఈ బైక్, ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్ ధరలు తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,902 నుంచి ప్రారంభమై రూ.76,437 వరకు ఉంది. మొత్తం నాలుగు వేరియంట్లలో లభించే ఈ బైక్‌ను అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
హీరో స్ప్లెండర్ ప్లస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ దగ్గర లక్ష రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రూ.9,000 డౌన్ పేమెంట్ చెల్లించి మీరు ఈ బైక్‌ను షోరూమ్ నుంచి బయటకు తీసుకురావచ్చు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా నెలనెలా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి 2 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు లోన్ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ జేబుపై పెద్దగా భారం పడదు.
2 ఏళ్ల లోన్ ప్లాన్ - వడ్డీ ఎంతంటే?
మీరు రెండేళ్ల పాటు లోన్ తీసుకోవాలని అనుకుంటే, నెలకు సుమారుగా రూ.3,612 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 9 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తే, మీరు 24 నెలల కాలంలో అసలుతో కలిపి మొత్తం రూ.86,688 కడతారు. ఇందులో వడ్డీ రూపంలో సుమారు రూ.7,631 అదనంగా చెల్లిస్తారు. తక్కువ కాలంలో అప్పు తీర్చాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
3 ఏళ్ల ప్లాన్ - నెలకు తక్కువ ఖర్చు
మీరు మూడు సంవత్సరాల (36 నెలల) కాలపరిమితితో లోన్ తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ ఇంకా తగ్గుతుంది. నెలకు రూ.2,514 కడితే సరిపోతుంది. ఇలా మూడు ఏళ్లలో మీరు మొత్తం రూ.90,504 చెల్లిస్తారు, అంటే ఇందులో రూ.11,447 వడ్డీ అన్నమాట. ఆదాయం తక్కువగా ఉన్నవారు ఈ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా నెలకు తక్కువ భారాన్ని భరించవచ్చు.
4 ఏళ్ల ప్లాన్ - భారీ ఊరట
ఒకవేళ మీరు ఈఎంఐ మరింత తగ్గించుకోవాలి అనుకుంటే, 4 ఏళ్ల (48 నెలల) ప్లాన్ ఉత్తమం. ఈ ప్లాన్ లో నెలకు కేవలం రూ.2,000 లోపే ఈఎంఐ పడుతుంది. అయితే, కాలపరిమితి పెరిగే కొద్దీ మీరు కట్టే వడ్డీ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. 4 ఏళ్ల ప్లాన్‌లో మీరు సుమారు రూ. 15,359 వడ్డీ రూపంలోనే అదనంగా కట్టాల్సి ఉంటుంది. అందుకే మీ బడ్జెట్ కు ఏది సెట్ అవుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.