Scooter Sales : స్కూటర్ మార్కెట్‌లో మళ్లీ నంబర్-1గా నిలిచిన యాక్టివా..సేల్స్‎లో టాప్ 10 టూ వీలర్లు ఇవే

సేల్స్‎లో టాప్ 10 టూ వీలర్లు ఇవే

Update: 2025-10-24 14:18 GMT

Scooter Sales : భారతదేశంలో స్కూటర్ల మార్కెట్ 2025 సెప్టెంబర్ నెలలో మరోసారి దూకుడు ప్రదర్శించింది. ఈ నెలలో స్కూటర్ అమ్మకాలు ఈ ఏడాది 9.12% వృద్ధిని నమోదు చేసి, మొత్తం 6,44,976 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ విభాగంలో ఎప్పటిలాగే హోండా యాక్టివా అగ్రస్థానంలో కొనసాగినా, దాని అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అయితే, టీవీఎస్ జూపిటర్ అద్భుతమైన వృద్ధిని సాధించి, యాక్టివాకు గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం స్కూటర్ మార్కెట్‌లో ఈ రెండు మోడల్స్ కలిసి 59% మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి.

హోండా యాక్టివా అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, అది భారత స్కూటర్ మార్కెట్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. యాక్టివా అమ్మకాలు 2,37,716 యూనిట్లుగా నమోదయ్యాయి. దీని మార్కెట్ వాటా 36.86% ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, యాక్టివా అమ్మకాలు -9.38% తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆగస్టు 2025లో కంపెనీ 25వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ మోడళ్లు మార్కెట్‌లో ఇంకా పట్టు సాధించాల్సి ఉంది.

టీవీఎస్ జూపిటర్ అద్భుతమైన వృద్ధిని సాధించి, హోండా యాక్టివాకు గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానానికి చేరుకుంది. జూపిటర్ అమ్మకాలు 1,42,116 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది అమ్మకాల్లో +38.07% భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 39,182 యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. దీని మార్కెట్ వాటా 22.03%గా ఉంది.

టాప్ 10 జాబితాలో మిగిలిన స్కూటర్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, మెరుగైన పనితీరు కనబరిచాయి. టీవీఎస్ యాక్సెస్ స్కూటర్ అమ్మకాలు 72,238 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది అమ్మకాల్లో +34.48% వృద్ధిని సాధించి, డిమాండ్‌ను పెంచుకుంది. బజాజ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 30,820 యూనిట్లు అమ్మి +8.03% వృద్ధిని నమోదు చేసింది. దీనితో పాటు బజాజ్ చేతక్ 30,558 యూనిట్లతో +7.16% స్థిరమైన వృద్ధిని చూపించింది. ఈ రెండు మోడళ్లు ఈవీ సెగ్మెంట్‌లో తమ పట్టు నిలుపుకున్నాయి. సుజుకి బర్గ్‌మాన్ అమ్మకాలు 28,254 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏకంగా +90.80% జబర్దస్త్ వృద్ధిని సాధించింది.

కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఏథర్ రిజ్టా స్కూటర్ అమ్మకాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఏథర్ రిజ్టా అమ్మకాలు 18,919 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది ప్రాతిపదికన +91.74% తో అత్యధిక వృద్ధి రేటును సాధించింది. కంపెనీ ఇటీవల Battery-as-a-Service (BaaS) స్కీమ్‌ను తీసుకురావడం వల్ల ఈ స్కూటర్ మరింత సరసమైనదిగా మారింది. టీవీఎస్ ఎన్టార్క్ అమ్మకాలు -13.56% తగ్గి 33,246 యూనిట్లుగా, అలాగే హోండా డియో అమ్మకాలు ఏకంగా -32.63% తగ్గి 23,829 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండు మోడళ్లు గత ఏడాది కంటే తక్కువ డిమాండ్‌ను చూశాయి.

Tags:    

Similar News