Honda Cars : హోండా కార్లపై భారీ డిస్కౌంట్.. ఈ ఎస్‌యూవీపై ఏకంగా రూ.1.22 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఆగస్టు వరకే!

ఆఫర్ ఆగస్టు వరకే!

Update: 2025-08-08 05:33 GMT

Honda Cars : పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కార్ల కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా కార్స్ ఇండియా తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. గ్రేట్ ఇండియా ఫెస్ట్ లో భాగంగా, కస్టమర్లు ఏకంగా రూ.1.22 లక్షల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ముఖ్యంగా హోండా ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై ఈ భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

హోండా ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయితే, వీటితో పోలిస్తే ఎలివేట్ అమ్మకాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాలను పెంచుకోవడానికి రూ.1.22 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, డిస్కౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను హోండా డీలర్‌షిప్‌లలో తెలుసుకోవచ్చు.

హోండా ఎలివేట్ చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది. లోపల విశాలమైన స్థలం, సౌకర్యం, నమ్మకమైన పనితీరును అందిస్తుంది. ఇది అత్యంత పవర్ ఫుల్ ఎస్‌యూవీ కాకపోయినా, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు, అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.13.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఎలివేట్‌లో హోండా సిటీలో ఉన్నటువంటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనిలో టర్బో-పెట్రోల్, హైబ్రిడ్ లేదా డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లేవు. కానీ, వినియోగదారులు మ్యాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఎంచుకోవచ్చు. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటరకు 15.31 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 16.92 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అయితే, జూన్ నెలలో ఎలివేట్ అమ్మకాల్లో నెలకు 56.25% వృద్ధి కనిపించడం విశేషం.

Tags:    

Similar News