Hyundai : కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. జూన్ నెలలో భారీ డిస్కౌంట్ల పండగ
జూన్ నెలలో భారీ డిస్కౌంట్ల పండగ
Hyundai : సరికొత్త కారు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా కొత్త కారు కొనుగోలుపై కస్టమర్లు ఏకంగా రూ. 1,00,000 వరకు ఆదా చేసుకునే సువర్ణ అవకాశం లభిస్తోంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి లగ్జరీ ఎస్‌యూవీల వరకు మొత్తం 8 మోడళ్లపై ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ కంపెనీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ లోని కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు, ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారి కోసం కంపెనీ తన సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్ పై రూ.85,000 వరకు బంపర్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. లగ్జరీ సెడాన్ కార్లను ఇష్టపడే వారి కోసం హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.55,000 వరకు, ఓల్డ్ మోడల్‌పై ఏకంగా రూ.95,000 వరకు భారీ తగ్గింపు లభిస్తోంది.
హ్యుందాయ్ కంపెనీకి చెందిన లగ్జరీ 7-సీటర్ ఎస్‌యూవీ అల్కాజార్ పై కస్టమర్లు ఈ నెలలో రూ.75,000 వరకు పొదుపు చేయవచ్చు. అలాగే, మార్కెట్లో టాటా పంచ్ కారుకు గట్టి పోటీ ఇస్తూ, తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్టర్ పై రూ.43,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. చిన్న ఫ్యామిలీస్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఈ కార్ల ధరలు తగ్గడంతో మిడిల్ క్లాస్ కొనుగోలుదారులు షోరూమ్‌ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
కంపెనీకి చెందిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై ఈ జూన్ లో రూ.78,000 వరకు అత్యధిక తగ్గింపు లభిస్తోంది. అలాగే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లయిన హ్యుందాయ్ ఐ20, ఐ20 ఎన్ లైన్ మోడళ్లపై రూ.63,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే హ్యుందాయ్ ఔరా పై రూ.25,000 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. మరో పాపులర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూ పై కస్టమర్లకు రూ.5,000 విలువైన స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది.
ఈ జూన్ నెలలో కొత్త హ్యుందాయ్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అనేవి దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు, నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారే అవకాశం ఉంటుంది. అలాగే కారు వేరియంట్ (పెట్రోల్/డీజిల్/సీఎన్‌జీ)ని బట్టి కూడా ఆఫర్ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన కారుపై ఉన్న ఖచ్చితమైన లైవ్ డిస్కౌంట్ వివరాలు, ఆన్-రోడ్ ధర తెలుసుకోవడానికి మీ దగ్గరలోని అధికారిక హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించడం మంచిది.