Hyundai Creta : భారత మార్కెట్లో హ్యుందాయ్ హవా.. ఇంతలా కొనేస్తున్నారు ఎందుకో ?

ఇంతలా కొనేస్తున్నారు ఎందుకో ?;

Update: 2025-07-16 04:50 GMT

Hyundai Creta : భారతదేశంలో కార్ల మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా హవా నడుస్తోంది. టాటా పంచ్, నెక్సన్, మారుతి బ్రెజ్జా లాంటి కార్లను వెనక్కి నెట్టి, 2025 మొదటి ఆరు నెలల్లోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. ఈ సమయంలో లక్షకు పైగా కార్లను అమ్మి, అద్భుతమైన రికార్డు సృష్టించింది. జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు హ్యుందాయ్ క్రెటా ఏకంగా 1,00,560 యూనిట్లను అమ్మింది. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 91,348 యూనిట్లతో పోలిస్తే ఇది 10% పెరుగుదల. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగానే కాకుండా, అన్ని రకాల కార్లలో రెండవ స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా లోపల కొత్త ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనిలో పెద్ద 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. డ్రైవర్ కోసం 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు హ్యుందాయ్ క్రెటాలో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS టెక్నాలజీ ఉన్నాయి. ఈ ADAS సిస్టమ్ డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తుంది.

క్రెటా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది.. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (నాచురల్లీ ఆస్పిరేటెడ్), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ ఆప్షన్లు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మంచి పర్ఫార్మెన్స్ అందిస్తాయి. హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ ధర రూ.20.30 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు వివిధ వేరియంట్లు, ఇంజిన్ ఆప్షన్లు, నగరాలను బట్టి మారతాయి.

Tags:    

Similar News