Hyundai : హ్యుందాయ్ ఐ20 కొత్త అవతార్.. లుక్ అదుర్స్.. ధర షాక్
లుక్ అదుర్స్.. ధర షాక్
Hyundai : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ఐ20 కొత్త నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు మరింత స్పోర్టీ, డార్క్ లుక్‌తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). నైట్ ఎడిషన్ స్పోర్ట్స్(ఓ), ఆస్టా(ఓ) వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే, ఐ20 ఎన్‌లైన్ నైట్ ఎడిషన్‌ను కూడా ఎన్8, ఎన్10 ట్రిమ్స్‌లో విడుదల చేశారు. ఐ20 ఎన్‌లైన్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.43 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఈ కొత్త ఎడిషన్‌లో చాలా బ్లాక్-అవుట్ ఫీచర్లు ఇచ్చారు. ఇవి కారును మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి. ఇందులో బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రేల్స్, స్కిడ్ ప్లేట్స్, సైడ్ సిల్ గార్నిష్, బ్లాక్ ఓఆర్వీఎమ్లు ఉన్నాయి. వెనుక భాగంలో ఒక రియర్ స్పాయిలర్, మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగో ఇచ్చారు. రెడ్ బ్రేక్ కాలిపర్స్, ప్రత్యేకమైన నైట్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఉన్నాయి. క్యాబిన్ లోపల ఆల్-బ్లాక్ థీమ్, బ్రాస్ ఇన్సర్ట్స్, బ్రాస్ హైలైట్స్ ఉన్న బ్లాక్ సీట్ అప్‌హోల్‌స్ట్రీ కూడా ఉన్నాయి.
ఇంకా, కారుకు స్పోర్టీ మెటల్ పెడల్స్ కూడా ఇచ్చారు. ఈ అప్‌డేట్స్ అన్నీ ఐ20 నైట్ ఎడిషన్‌కు ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా దీనిని డిజైన్ చేశారు. కారు మెకానిక్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. హ్యుందాయ్ ఐ20 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అదే విధంగా, ఐ20 ఎన్‌లైన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పాటు 6-స్పీడ్ మాన్యువల్, డీసీటీ ఆప్షన్లలో వస్తుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ ఐ20, ఎన్‌లైన్ మోడల్స్‌తో పాటు లభిస్తుంది. నైట్ ఎడిషన్ లక్ష్యం, కస్టమర్లకు ప్రీమియం లుక్, స్పోర్టీ డిజైన్ కలయికను అందించడం. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్టైల్, స్పోర్టీ లుక్, అడ్వాన్సుడ్ ఫీచర్లు కోరుకునే వారికి హ్యుందాయ్ ఐ20 నైట్ ఎడిషన్ సరైన ఎంపిక. ముఖ్యంగా కొత్త తరం, యువతకు దీని డార్క్-థీమ్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.