Windsor EV : అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ విండ్‌సర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్..300మందికే ఛాన్స్
300మందికే ఛాన్స్
Windsor EV : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు విండ్‌సర్ కొత్త అవతార్‌లో వచ్చేసింది. దేశంలో ఈ కారు విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఈవీ మోటార్ ఇండియా దీన్ని ఇన్‌స్పైర్ ఎడిషన్ పేరుతో ప్రత్యేకంగా తీసుకొచ్చింది. అయితే ఇది లిమిటెడ్ ఎడిషన్. కేవలం 300 మంది కొనుగోలుదారులు మాత్రమే ఈ ప్రత్యేక కారును సొంతం చేసుకోగలరు. ఈ కొత్త ఇన్‌స్పైర్ ఎడిషన్ ఫీచర్లు, బుకింగ్ వివరాలు, ధర గురించి పూర్తి సమాచారం ఈ వార్తలో తెలుసుకుందాం.
ఈ కొత్త ఇన్‌స్పైర్ ఎడిషన్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కారును కొనాలనుకునే వారు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న వారికి అక్టోబర్ 15 నుండి డెలివరీలు మొదలవుతాయి. ఈ కారు పర్ల్ వైట్, స్టారీ బ్లాక్ డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్‌లో లభిస్తుంది.
స్టాండర్డ్ మోడల్ కంటే ఈ ఇన్‌స్పైర్ ఎడిషన్‌లో చాలా కొత్త స్టైలింగ్ మార్పులు చేశారు. ఇందులో ఆల్-బ్లాక్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్కు రోజ్ గోల్డ్ ఇన్సర్ట్‌లు జతచేశారు. అలాగే, సైడ్ మిర్రర్స్ బ్లాక్-అవుట్ చేశారు. ప్రత్యేకంగా ఇన్‌స్పైర్ బ్యాడ్జింగ్ ఉంటుంది.
కారు లోపలి భాగంలో సంగ్రియా రెడ్, బ్లాక్ లెదర్‌తో డ్యూయల్-టోన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. సీట్ల విషయానికి వస్తే, ఇందులో 135-డిగ్రీల వరకు రిక్లైన్ చేయగలిగే ఏరో లాంజ్ సీట్లు, బ్లాక్-అవుట్ ఆర్మ్‌రెస్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫీచర్లు కారు లోపల మరింత లగ్జరీ అనుభూతిని ఇస్తాయి. లగ్జరీని మరింత పెంచడానికి ఈ ఎడిషన్ కోసం ఒక ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, సైడ్ మోల్డింగ్‌లపై రోజ్ గోల్డ్ డిజైన్, 3D ఇన్‌స్పైర్ థీమ్‌తో కూడిన ఫ్లోర్ మ్యాట్స్, లెదర్ కీ కవర్, బ్రాండెడ్ కుషన్‌లు, బంపర్ కార్నర్ గార్డులు లభిస్తాయి. అదనంగా, కస్టమర్‌లు స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, డ్రైవ్ మేట్ ప్రో+ కిట్ వంటి ఆప్షనల్ ఫీచర్లను కూడా ఎంచుకోవచ్చు.
విండ్‌సర్ ఈవీ బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ మోడల్‌లో కూడా లభిస్తుంది. ఈ మోడల్ వల్ల కిలోమీటరుకు దాదాపు రూ.3.9 మాత్రమే ఖర్చవుతుంది, ఇది చాలా తక్కువ రన్నింగ్ కాస్ట్. BaaS స్కీమ్ కింద, ఇన్‌స్పైర్ ఎడిషన్ కారు ధర రూ.9.99 లక్షలు లేదా మొత్తం ధర రూ.16.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఇన్‌స్పైర్ ఎడిషన్‌లో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారులో కొత్తగా వాచ్ వెల్‌నెస్ యాప్ అనే కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. ఇది కారు ఆగి ఉన్నప్పుడు కూడా ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ద్వారా నేరుగా హెల్త్, మైండ్‌ఫుల్‌నెస్ వీడియోలను అందిస్తుంది.