Bolero : బొలెరో కొనేవారికి పండగే పండగ.. ఏకంగా రూ.1.27 లక్షల వరకు తగ్గింపు..ఎందుకో తెలుసా?
ఏకంగా రూ.1.27 లక్షల వరకు తగ్గింపు..ఎందుకో తెలుసా?
Bolero : మహీంద్రా బొలెరో కారు కొనాలని కలలు కంటున్నారా? అయితే ఇదే సరైన టైం మహీంద్రా తమ లేటెస్ట్ అప్‌డేట్‌లో బొలెరోపై ఏకంగా రూ. 1.27 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
మహీంద్రా బొలెరోపై భారీ తగ్గింపు
మహీంద్రా తమ అధికారిక X ఖాతాలో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. బొలెరో కారుపై కస్టమర్లకు జీఎస్టీ తగ్గింపు కింద రూ. 1.27 లక్షల వరకు ఆదా అవుతుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ ఇప్పుడు వెంటనే అమలులోకి వస్తుందని, కాబట్టి కస్టమర్లు ఆలస్యం చేయకుండా వెంటనే షోరూమ్‌కు వెళ్లి తమ కొత్త బొలెరోను బుక్ చేసుకోవచ్చని మహీంద్రా తెలిపింది.
బొలెరో ఎందుకు స్పెషల్
మహీంద్రా బొలెరో భారతీయ రోడ్లపై దాని మన్నిక, పటిష్టతకు పేరుపొందింది. దీని పటిష్టమైన డిజైన్, స్ట్రాంగ్ బాడీతో పాటు పవర్ఫుల్ ఇంజిన్ అద్భుతమైన ప్రదర్శనను అందిస్తాయి. దీని మెయింటెన్స్ ఖర్చు కూడా తక్కువ. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ బొలెరో ప్రజలకు ఫస్ట్ ఆప్షన్‌గా నిలిచింది.
ఇది ఎందుకు మంచి అవకాశం?
బొలెరోపై ఇంత పెద్ద మొత్తం తగ్గింపు రావడం ఇదే మొదటిసారి. పండుగ సీజన్‌కు ముందే ఈ ఆఫర్ రావడంతో కస్టమర్లకు ఇది చాలా మంచి అవకాశం. జీఎస్టీ తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాలను మహీంద్రా నేరుగా కస్టమర్లకు అందిస్తోంది.ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి, వెంటనే షోరూమ్‌కు వెళ్లి బుక్ చేసుకోవడం మంచిది.