Mahindra : 2026లో మహీంద్రా 3 కొత్త ఎస్‌యూవీలు.. ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Update: 2025-09-01 12:47 GMT

Mahindra : మహీంద్రా కంపెనీ భారత మార్కెట్‌లోకి రాబోయే రోజుల్లో కొత్త ఎస్‌యూవీలను తీసుకురావాలని యోచిస్తోంది. 2026 నాటికి ఈ కంపెనీ అనేక కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఫేస్‌లిఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ మోడళ్లు, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ వాహనాల్లో ఏం స్పెషాలిటీ ఉందో తెలుసుకుందాం.

మహీంద్రా XEV 7e

మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైన్‌అప్‌ను XEV 9e బెస్డ్ కొత్త త్రీ-రో ఎస్‌యూవీతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. మహీంద్రా XEV 7e పేరున్న ఈ ఎలక్ట్రిక్ కారు నవంబర్ లేదా డిసెంబర్ 2025లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ XEV 9e తో తన ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్, ఫీచర్స్, డిజైన్‌ను పంచుకుంటుంది. XEV 7e 59kWh, 79kWh LFP బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఇవి 542 కి.మీ, 656 కి.మీ. రేంజ్‌ను ఇస్తాయి. అయితే, 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు డ్రైవింగ్ రేంజ్ కొంత భిన్నంగా ఉండవచ్చు.

మహీంద్రా XUV 3XO హైబ్రిడ్

మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త ఎస్‌యూవీల కోసం హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను డెవలప్ చేస్తోంది. కంపెనీ మొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ అవుతుంది. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. ఇందులో 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడ్ టెక్నాలజీతో అందించవచ్చు. అయితే, దీని డిజైన్, క్యాబిన్, ఫీచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ హైబ్రిడ్ వెర్షన్‌లో బయట హైబ్రిడ్ బ్యాడ్జ్‌తో పాటు, లోపల కొన్ని మార్పులు ఉండవచ్చు.

నెక్స్ట్-జెనరేషన్ మహీంద్రా బొలెరో

కొత్త జనరేషన్ మహీంద్రా బొలెరో అధికారికంగా 2026లో మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ ఎస్‌యూవీలో ప్రస్తుత డీజిల్ ఇంజిన్‌ను కొనసాగిస్తూనే, డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ వాహనం స్పై ఫోటోల ప్రకారం.. 2026 మహీంద్రా బొలెరో తన పాత స్టైల్‌ను అలాగే కొనసాగిస్తుంది. ఇందులో పెద్ద అప్‌గ్రేడ్ ఏమిటంటే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెవల్ 2 ఏడీఏఎస్, ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా ఉండవచ్చు.

Tags:    

Similar News