Trending News

Mahindra Thar Roxx : జిమ్నీకి చుక్కలు చూపించేలా.. మరింత పవర్‌ఫుల్ లుక్‌లో మహీంద్రా థార్ రాక్స్

మరింత పవర్‌ఫుల్ లుక్‌లో మహీంద్రా థార్ రాక్స్

Update: 2026-01-22 05:30 GMT

Mahindra Thar Roxx : మహీంద్రా థార్ అంటేనే ఒక ఎమోషన్. ఐదు డోర్ల థార్ రాక్స్ విడుదలైనప్పటి నుంచి దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే కస్టమర్లను మరింత ఆకర్షించడానికి మహీంద్రా ఇప్పుడు ఒక స్పెషల్ ఎడిషన్‎ను తీసుకురాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ ఫొటోలను గమనిస్తే.. ఈ కారులో డార్క్ స్టైలింగ్ ఎలిమెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్ ఫినిషింగ్, కాంట్రాస్ట్ హైలైట్స్ ఈ వాహనానికి ఒక అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇది పూర్తి స్థాయి మోడల్ అప్‌డేట్ కాకపోయినప్పటికీ, లుక్స్ పరంగా మాత్రం చాలా మార్పులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

సాధారణంగా మహీంద్రా తన టాప్ సెల్లింగ్ కార్లకు మధ్యమధ్యలో ఇలాంటి స్పెషల్ ట్రిమ్స్ లేదా లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేస్తూ ఉంటుంది. థార్ రాక్స్ కూడా ఇటీవలే లాంచ్ అయినందున, ఇప్పుడప్పుడే ఇంజిన్ లేదా మెకానికల్ మార్పులు చేసే అవకాశం లేదు. కాబట్టి, ఈ కొత్త వేరియంట్ ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్స్‎తోనే రానుంది. ఇందులో టింటెడ్ హెడ్ ల్యాంప్స్, బాడీపై సరికొత్త గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్లు, బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. లోపలి భాగంలో కూడా కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన సీట్లు, స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి ఉండొచ్చు.

మెకానికల్ పరంగా చూస్తే..ఈ కొత్త థార్ రాక్స్ వేరియంట్‌లో కూడా ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కొనసాగించనున్నారు. ఇవి మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో పాటు 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) సామర్థ్యంతో వస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ద్వారా మారుతి సుజుకి జిమ్నీకి గట్టి పోటీ ఇవ్వాలని మహీంద్రా భావిస్తోంది. ప్రత్యేకంగా స్టైల్, ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే యువతను లక్ష్యంగా చేసుకుని ఈ వెర్షన్‌ను రూపొందించారు.

https://www.instagram.com/reels/DTulXLYij1K/

ఈ కొత్త వేరియంట్ ధర సాధారణ మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వరలోనే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనుంది. ఇప్పటికే బుకింగ్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్న థార్ రాక్స్, ఈ కొత్త రఫ్ అండ్ టఫ్ లుక్‌తో మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఆఫ్-రోడింగ్ లవర్లకు ఇది ఖచ్చితంగా ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.

Tags:    

Similar News