Mahindra XEV 7e: 600 కి.మీ. రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. ఎలక్ట్రిక్ మహింద్రా XUV700 వచ్చేస్తోంది
ఎలక్ట్రిక్ మహింద్రా XUV700 వచ్చేస్తోంది;
Mahindra XEV 7e: మహింద్రా కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు XUV700ను ఎలక్ట్రిక్ వెర్షన్లో తీసుకురాబోతుంది. దీనికి XEV 7e అని పేరు పెట్టారు. ఈ ఎస్‌యూవీ ఇటీవల టెస్టింగ్ సమయంలో భారత రోడ్లపై కనిపించింది. దీని డిజైన్, ఫీచర్ల గురించి చాలా కీలక సమాచారం లీక్ అయ్యింది. టెస్టింగ్ సమయంలో ఈ ఎస్‌యూవీ పూర్తిగా కవర్ చేయబడి ఉంది. అయినప్పటికీ దాని డిజైన్ విశేషాలను గమనించవచ్చు. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్ ఉంది. ఇది గాలి రెసిస్టెన్స్ తగ్గించి ఈవీకి స్పెషల్ లుక్ ఇచ్చింది. ఇందులో L- ఆకారపు LED DRLలు, డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఎస్‌యూవీకి మరింత ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. దీని సైజ్ XUV700ను పోలి ఉన్నప్పటికీ, చిన్నపాటి మార్పులు దీన్ని XEV ఫ్యామిలీలో స్పెసల్ గా నిలుపుతాయి.
మహింద్రా XEV 7e ఇంటీరియర్ XEV 9e నుండి ఇన్ స్పైర్ అయినట్లు తెలుస్తోంది. అంటే ఇందులో కొత్త టెక్నాలజీతో పాటు ప్రీమియం ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇందులో కొత్తగా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, దీనిపై LED లోగో ఉంటుంది. అలాగే, మూడు-పీస్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్ కలిసి ఉంటాయి. 16-స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ + డాల్బీ అట్మాస్ అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్, ఆంబియంట్ లైటింగ్, అప్‌మార్కెట్ ఇంటీరియర్ ఫినిషింగ్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
మహింద్రా XEV 7eను మహింద్రా కొత్త INGLO స్కేట్‌బోర్డ్ EV ప్లాట్‌ఫాంపై నిర్మించనున్నారు. ఇందులో 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లు లభించే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్‌తో ఇది 600 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుందని అంచనా. ఇందులో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది RWD, AWD రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. RWD వేరియంట్ సింగిల్ మోటార్‌తో వస్తే, AWD వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ ఉంటుంది. ఇది దాదాపు 325 bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. మహింద్రా ఇంకా XEV 7e అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే, ఆగస్టు 2025లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీనిని టీజ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.