Trending News

Mahindra XEV 9S : 679 కి.మీ రేంజ్, 202కిమీ టాప్-స్పీడ్.. మార్కెట్లోకి మహీంద్రా XEV 9S

మార్కెట్లోకి మహీంద్రా XEV 9S

Update: 2025-11-27 10:21 GMT

Mahindra XEV 9S : పవర్ఫుల్ మోడళ్లకు పేరుగాంచిన మహీంద్రా, ఇప్పుడు తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అదే మహీంద్రా XEV 9S. ఈ కారు అత్యధికంగా ఏకంగా 679 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటించింది. కేవలం రేంజ్ మాత్రమే కాదు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గంటకు 202 కిమీ టాప్-స్పీడ్ తో పరుగు తీయగలదు. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన 7-సీటర్ సౌకర్యంతో వస్తున్న ఈ కొత్త EV వివరాలు, ధరలు, రేంజ్ వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా ఇప్పుడు తన కొత్త ప్రీమియం 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు అయిన XEV 9S ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌తో, మహీంద్రా తన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోలో తొలిసారిగా 3-రో (మూడు వరుసల సీట్లు) మోడల్‌ను చేర్చింది. ఈ కారును ముఖ్యంగా ఎక్కువ స్థలానికి ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేశారు. అందుకే దీని పేరులో S అక్షరం స్పేస్‌ను సూచిస్తుంది. ఇది INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. XEV 9S మొత్తం నాలుగు వేరియంట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.95 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ కోసం రూ.29.45 లక్షల వరకు ఉంటుంది.

మహీంద్రా XEV 9S కోసం బుకింగ్‌లు జనవరి 14, 2026 నుంచి ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు మొదలైన పది రోజుల్లోనే, అంటే జనవరి 23, 2026 నుంచి ఈ కారు డెలివరీలు కూడా మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. మహీంద్రా XEV 9S మొత్తం మూడు LFP బ్యాటరీ ప్యాక్ వేరియంట్లలో లభిస్తుంది..అవి 59 kWh, 70 kWh, 79 kWh. ఈ ఈవీ నాలుగు డ్రైవ్ మోడ్‌లు, ఐదు రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవల్స్‌ను అందిస్తుంది.

ఈ కారు 210 kW పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 100కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్-స్పీడ్ గంటకు 202 కిమీగా ఉంది. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌లు MIDC టెస్టింగ్ ప్రకారం సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 679 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలవని మహీంద్రా పేర్కొంది. 59 kWh బ్యాటరీ ప్యాక్‌తో 521 కి.మీ, 70 kWh బ్యాటరీ ప్యాక్‌తో 600 కి.మీ రేంజ్ లభించే అవకాశం ఉంది.

సేఫ్టీ విషయంలో మహీంద్రా ఏమాత్రం రాజీ పడలేదు. XEV 9S లో 7 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, అత్యాధునిక లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ను అందించింది. ఈ ADAS కోసం కారులో 5 రాడార్లు, ఒక విజన్ కెమెరా ఉన్నాయి. ఈ ఫీచర్లు డ్రైవర్‌కు మరింత సేఫ్టీని అందిస్తాయి. కారు లోపలి భాగం ఫ్లాట్ ఫ్లోర్ లే-అవుట్‌పై ఆధారపడి ఉంది. దీనివల్ల మూడు వరుసల సీట్లలో కూర్చునే వారికి కూడా లెగ్‌రూమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది లగ్జరీయస్ సీటింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Tags:    

Similar News